- Advertisement -
ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో విజయం సాధించింది కోల్‌కతా నైట్ రైడర్స్. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తుగా ఓడించి నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సన్ రైజర్స్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి చేధించింది. వెంకటేశ్ 28 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలవగా శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 58 నాటౌట్‌గా నిలిచారు. దీంతో కోల్ కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ చేతులేత్తేయగా రాహుల్ త్రిపాఠి 71 పరుగులతో రాణించాడు. చివరలో క్లాసెన్ 21 బంతుల్లో 32 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
Also Read:పాయల్ రాజ్‌పుత్.. ‘రక్షణ’
- Advertisement -