IPL 2023 : వావ్.. ” సన్ ” సత్తా !

37
- Advertisement -

ఐపీఎల్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సత్తా చాటింది. మొదట వరుస పరాజయాలతో విఫలమైన రైజర్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకొని ఈ సీజన్ లో బోణి కొట్టింది. ఇక తాజాగా కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా విధ్వంసం సృస్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన రైజర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్ కతా ముందు ఉంచింది. సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ హ్యారీ బ్రూక్స్ 55 బంతుల్లో 100 ( 12 ఫోర్లు, 3 సిక్సులు ) పరుగులు చేసి సెంచరీతో కోల్ కతా బౌలర్స్ ను ఊచకోత కోశాడు..

బ్రూక్స్ కు తోడు కెప్టెన్ మర్క్మ్ 26 బంతుల్లో 50 పరుగులు ( 2 ఫోర్లు, 5 సిక్సర్లు ), అభిషేక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు చేసి.. ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించారు సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా లక్ష్య చేధనలో గట్టిగానే ప్రయత్నించింది. కెప్టెన్ నితీశ్ రాణా 41 బంతుల్లో 75 పరుగులు, రికూ సింగ్ 31 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు కు విజయాన్ని అందించే ప్రయత్నం చేసిన సన్ రైజర్స్ బౌలర్స్ ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి ఓటమి చవి చూసింది.

ఇక ఈ మ్యాచ్ విజయంతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టిక స్థానాన్ని మెరుగు పరుచుకుంది. మరి రాబోయే మ్యాచ్ లలో కూడా రైజర్స్ దూకుడు ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాలి. ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ లో అభిమానులకు డబుల్ బొనంజా గా రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ 3:30 నిముషాలకు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్ లో బెంగళూరు మరియు డిల్లీ తలపడనున్నాయి. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం బెంగళూరు కు కలిసొచ్చే అంశం. ఇక మరొక మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు అటల్ బిహారీ వాజ్ పెయ్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో లక్నో మరియు పంజాబ్ జట్లు తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి…

IPL 2023: రైడర్స్ vs రైజర్స్ .. గెలిచేదెవ్వరు?

IPL 2023:గుజరాత్ తో పంజాబ్ కు ముప్పే!

కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!

- Advertisement -