ఇండియన్ క్రికెట్ లో రోహిత్ శర్మ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలిసిందే. అభిమానుల చేత హిట్ మ్యాన్ గా పిలిపించుకునే రోహిత్.. ఎన్నో అరుదైన రికార్డులకు పెట్టింది పేరు. వన్డేలలో ఏ ప్లేయర్ కు సాధ్యం కానీ మూడు డబుల్ సెంచరీలు, ఒకే మ్యాచ్ లో 264 పరుగులు.. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, రెండు ఛాంపియన్ ట్రోఫీలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ రికార్డులు లిస్ట్ వస్తూనే ఉంటుంది. కోహ్లీ, ధోని లకు కూడా సాధ్యం కానీ రికార్డులు రోహిత్ ఖాతాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి హిట్ మ్యాన్ పుట్టినరోజు నేడు. ఐపీఎల్ లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నేడు రాజస్తాన్ రాయల్స్ తో తలపడనుంది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తోంది..
Also Read:వైసీపీనే టార్గెట్..బాలయ్యతో బోయపాటి!
రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ లో పెద్దగా రాణించకపోవడంతో ముంబై వరుస ఓటములను మూటగట్టుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్ తోనైనా ముంబై ఇండియన్స్ కామ్ బ్యాక్ ఇవ్వాలని.. రోహిత్ శర్మ లో మునుపటి హిట్ మ్యాన్ ను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి తన బర్త్ డే సందర్భంగా మునుపటి జోరు చూపించి అభిమానులకు రోహిత్ శర్మ బర్త్ డే ట్రీట్ ఇస్తాడేమో చూడాలి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు వీకెండ్ స్పెషల్ గా నేడు మద్యాహ్నం 3:30 నిముషాలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ప్రస్తుతం చెన్నైటాప్ 5 లో కొనసాగుతున్నప్పటికి గత మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్ లో లక్నో చేతిలో భారీ ఓటమిని చవి చూసింది. దీంతో ఈ రెండు జట్లు కూడా విజయంపై గట్టిగా కన్నెశాయి. మరి ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.
Also Read:6 ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్