నేటి ఐపీఎల్ మ్యాచ్ లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. అటల్ బిహారీ వాజ్ పై స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్ లో లక్నో అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో పే బ్యాక్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో లక్నో పై ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు పట్టుదలగా ఉంది. ఇక మొత్తం ఐపీఎల్ కెరియర్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా అందులో బెంగళూరు రెండుసార్లు విజయం సాధిస్తే.. లక్నో ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్ లు ఆడిన లక్నో అందులో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక బెంగళూరు కూడా ఎనిమిది మ్యాచ్ లకు గాను నాలుగింట్లో మాత్రమే గెలుపొందింది.
Also Read:నేడు మహారాష్ట్ర అవతరణ దినోత్సవం
దాంతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి లక్నోపై పైచేయి సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తోంది ఆర్సీబీ. లక్నో గత మ్యాచ్ లో పంజాబ్ పై భారీ విజయాన్ని సాధించి ఫుల్ జోరు మీద ఉంది. కేఎల్ రాహుల్ స్టాయీనీస్, పురన్ లాంటి వాళ్ళు అద్బుతమైన ఫామ్ లో ఉండడం లక్నో కు కలిసొచ్చే అంశం. అటు బౌలింగ్ లోనూ లక్నో జోరు చూపిస్తోంది. ఇక ఆర్సీబీలో కూడా కోహ్లీ, మ్యాక్స్ వెల్, డూప్లిసిస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దాంతో లక్నో మరియు ఆర్సీబీ మద్య హోరాహోరీ పోరు జరగడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లక్నో జోరు కొనసాగిస్తుందా లేదా బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది చూడాలి. ఇక నిన్న జరిగిన డబుల్ ధమాకా మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ లో చెన్నై పై పంజాబ్ విజయం సాధించగా, రెండవ మ్యాచ్ లో రాజస్తాన్ పై ముంబై ఘన విజయం సాధించింది.
Also Read:తల్లైన స్వామి రారా బ్యూటీ!