IPL 2023: ముంబై చెత్త రికార్డు

49
- Advertisement -

ఐపీఎల్‌లో ముంబై చెత్త రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 11వ సారి తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ముంబై. దీంతో 2013 నుండి 2023 వరకు ప్రతీ సీజన్‌లో తొలి మ్యాచ్ ఓడిపోయిన జట్టుగా చెత్త రికార్డు నెలకొల్పింది.

2013 ఐపీఎల్ సీజన్‌లో ముంబై జట్టు తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ఆర్సీబీ 2 పరుగుల తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించింది. 2014,2015లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తో 2016,2017లో ఫూణెతో, 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తో , 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తో , 2020లో సీఎస్‌కేతో, 2021 లో ఆర్సీబీతో, 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఓటమి పాలైంది. అయితే ఇప్పటివరకు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -