IPL 2023:బెంగళూరు తో కోల్ కతా.. ఢీ!

46
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు మరియు కోల్ కతా తలపడనున్నాయి. రాత్రి 7 ; 30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు చెరో ఏడు మ్యాచ్ లు అడగా, బెంగళూరు నాలుగు విజయాలు సాధించింది. ఇక కోల్ కతా రెండు విజయాలు మాత్రమే సాధించి రేస్ లో కాస్త వెనకకబడింది. ఇక ఐపీఎల్ మొత్తం మీద ఈ రెండు జట్ల మద్య ఇప్పటివరకు 31 మ్యాచ్ లు జరగగా అందులో 17 మ్యాచ్ ల్లో కోల్ కతా విజయం సాధిస్తే.. 14 సార్లు బెంగళూరు విజయం సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే కోల్ కతా దే పై చేయిగా ఉంది.

ఇక గత రెండు మ్యాచ్ లలో విజయం సాధించి బెంగళూరు ఫుల్ జోష్ లో ఉంది. దాంతో కోల్ కతా పై కూడా విజయం సాధించి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని బెంగళూరు భావిస్తోంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలు అయిన కోల్ కతా కు ఈ మ్యాచ్ గెలవడం ఎంతో కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే పాయింట్ల పట్టికలో కోల్ కతా స్థానం మరింత దిగజే అవకాశం ఉంది. ఇక రెండు జట్లలోను హార్డ్ హిట్టర్లు, పదునైన పేస్ బౌలర్లు మెండుగా ఉన్నారు.

Also Read:ముంబై పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

దీంతో ఇరు జట్ల మద్య ఆసక్తికరమైన పోరు నడిచే అవకాశం ఉంది. ఇక నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో గుజరాత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 55 పరుగుల తేడాతో ముంబై పై భారీ విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఇక లక్ష్య చేధనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే కుప్పకూలింది.

Also Read:IMD:రాగల మూడు రోజులు వడగళ్ల వానలు..ఆరెంజ్ అలెర్ట్

- Advertisement -