ఆర్సీబీని చిత్తు చేసిన కోల్ కతా

29
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా ఆర్సీబీ మరో ఓటమిని మూటగట్టుకుంది. హోమ్ గ్రౌండ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కోల్ కతా విధించిన 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
విరాట్ కోహ్లి(54; 37 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

Also Read:ఛాంగురే బంగారురాజా టీజర్‌ లాంచ్‌ బై రవితేజ

ఇక అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. జేస‌న్ రాయ్‌(56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్‌సెంచరీతో రాణించగా నితీశ్ రాణా(48; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు.

Also Read:KCR:దేశప్రజలు వాస్తవాలు గ్రహించాలి

- Advertisement -