IPL 2023:ఫైనల్.. ఛాంపియన్ ఎవరో ?

31
- Advertisement -

ఐపీఎల్ 16 వ సీజన్ లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికీ నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు గత సీజన్ టైటిల్ గెలిచిన డీపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు కప్పు వేటలో అడుగు దూరంలో నిలిచాయి. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడి స్టేడియం వేధిక కానుంది. ఇక ప్రస్తుతం ఇరు జట్లు కూడా పటిష్టమైన లైనప్ తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఏ జట్టు విజయం సాధిస్తుందో అని చెప్పడం క్రీడా విశ్లేషకులకు సైతం పెద్ద టాస్క్ లా మారింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ దుర్భేద్యంగా కనిపిస్తోంది. .

కాన్వే, దుబే, ఋతురాజ్ గైక్వాడ్, రహనే వంటి ఆటగాళ్లు అద్బుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇక ధోని కెప్టెన్సీ చెన్నై కి ప్రధాన బలం. అటు గుజరాత్ జట్టులో కూడా శుబ్ మన్ గిల్, హర్డిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్ వంటి హార్డ్ హిట్టర్స్ ఆ జట్టు సొంతం. గత మూడు మ్యాచ్ లలో గిల్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. మూడు మ్యాచ్ లలోనూ మూడు సెంచరీలు గిల్ నమోదు చేశాడంటే.. అతను ఏ స్థాయిలో ఫామ్ లో ఉన్నడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్ ఐపీఎల్ తో ఎం‌ఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దాంతో ఈ చివరి ఐపీఎల్ లో చెన్నై ని ఛాంపియన్ గా చూడాలని సిఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ జరుగుతుడడం గుజరాత్ కు కలిసొచ్చే అంశం. అయితే మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓటమిపాలు అయిన గుజరాత్ ఫైనల్ లో మట్టికరిపించి వరుసగా రెండో సారి ఛాంపియన్ నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందో చూడాలి.

Also Read:

 

- Advertisement -