ఐపీఎల్ 2023లో భాగంగా ఎట్టకేలకు ఖాతా తెరచింది ఢిల్లీ. కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో 57, మనీష్ పాండే(21), అక్షర్ పటేల్(19 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ విజయం సాధించి ఈ సీజన్లో తోలి విజయాన్ని నమోదుచేసింది.
Also Read:LPG:దేశంలో రెట్టింపైన ఎల్పీజీ కనెక్షన్లు…
ఇక అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ బౌలర్ల ధాటికి కోల్ కతా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓ దశలో 96 పరుగులకే 9 వికెట్లు కొల్పోయింది. జేసన్ రాయ్(43), ఆండ్రీ రస్సెల్(38 నాటౌట్; 31 బంతుల్లో 1ఫోర్, 4సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టాడు.
Also Read:సామజవరగమన…వాట్ టు డూ ఫస్ట్ సింగిల్