ఐపీఎల్ 16 వ సీజన్ టైటిల్ పోరులో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో గెలిచి ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరగా.. నిన్న జరిగిన రెండో క్వాలిఫయర్ఫ్ మ్యాచ్ లో ముంబై ని ఓడించి గుజరాత్ టైటాన్స్ టైనల్ లోకి అడుగుపెట్టింది. దాంతో కప్పుకు అడుగు దూరంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మద్య జరిగే తుది పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ 28న జరగనుంది. కాగా నిన్న జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోరు చేసింది.
Also Read:IPL 2023:ఫైనల్లో గుజరాత్
యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ భీకరమైన బ్యాటింగ్ తో 60 బంతుల్లో 129 పరుగులు చేసి ముంబై బౌలర్స్ ను ఊచకోత కోశాడు. గిల్ సెంచరీకి తోడు సుధర్శన్ 43 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఆ తరువాత లక్ష్య చేధనలో ముంబై ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన గుజరాత్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటర్స్ కుదేలయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరచగా.. సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులు, తిలక్ వర్మ 43 పరుగులు చేసి జట్టు విజయం కోసం పోరాడిన ఫలితం లేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతుండడంతో 18 ఓవర్లలోనే 171 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. దాంతో టైటిల్ రేస్ నుంచి ముంబై నిష్క్రమించగా.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Also Read:కళ్ళు తిరుగుతున్నాయా.. జాగ్రత్త !