ఐపీఎల్‌ ఫైనల్లో గుజరాత్…

95
gujarath
- Advertisement -

ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్‌ విధించిన భారీ లక్ష్యాన్ని ఇంకో 9 బంతులు ఉండగానే చేధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. డేవిడ్ మిల్లర్‌(68) విధ్వంసంకు తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్య ‌(40), శుభ్‌మన్‌(35), వేడ్‌(35) కూడా రాణించడంతో విజయం సాధించింది. ముఖ్యంగా మిల్లర్ …సిక్స్‌లు,ఫోర్లతో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఆరంభం నుండే ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్. ఓవర్‌కి పది చొప్పున రన్‌రేట్ మెయిన్‌టెన్ చేస్తు వచ్చారు. మధ్యలో కాస్త తగ్గిన డెత్ ఓవర్లలో బట్లర్ ధాటికి భారీ స్కోరు సాధించింది. బట్లర్ 89, శాంసన్ 47 పరుగులు చేశారు. అయితే తొలి క్వాలిఫయర్‌లో ఓడినా రాజస్ధాన్‌కు మరో అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్ లో విజేతతో రాజస్తాన్ తలపడనుంది.

- Advertisement -