ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారులతో అధికారుల సమావేశం..

106
ifs

2019 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఎఫ్ఎస్ (IFS) అధికారులతో అరణ్య భవన్ లో సీనియర్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ కోసం విధుల్లో చేరుతున్నారు నలుగురు ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులు దినేష్, నీరజ్, నవీన్, ప్రశాంత్.

తెలంగాణలో అడవుల పరిరక్షణ, తెలంగాణకు హరితహారం, అటవీ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానపరమైన నిర్ణయాలను కొత్త అధికారులకు వెల్లడించిన పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఇతర ఉన్నతాధికారులు.

క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా తమకు కేటాయించిన అటవీ సర్కిళ్లకు వెళ్లనున్నారు ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులు.ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ అధికారులు పీ. రఘువీర్, లోకేష్ జైస్వాల్, RM దోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, MC పరిగెయిన్, సిద్ధానంద్ కుక్రేటీ పాల్గొన్నారు.