ఐపీఎల్‌ 13…ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు వీరే..!

656
ipl
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఐపీఎల్‌ వేలంకు ముందు ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను మార్చుకునే అవకాశంతో పాటు వదులుకునే అవకాశం కల్పించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు సీనియర్ ఆటగాళ్లను వదులుకున్నాయి.

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 12 ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వీరిలో యువరాజ్ సింగ్, బెన్ కటింగ్, అల్జారీ జోసెఫ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను వదులుకోగా… శామ్ బిల్లింగ్స్, మోహిత్ శర్మ వంటి వారు ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్, మార్టిన్ గప్టిల్, దీపక్ హుడా, రికీ భుయిలను విడుదల చేయగా, డేవిడ్ మిల్లర్, శామ్ కర్రన్‌లను విడుదల చేసింది పంజాబ్.

బెంగళూరు ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేయగా గత 12 సీజన్లగా ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి జట్టు కూర్పును బలంగా ఉండేలా చూసుకుంటోంది. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో మొదటిసారి క్రికెటర్ల వేలం కోల్‌కతాలో జరగనుండటం విశేషం.

- Advertisement -