యూఏఈలో ఐపీఎల్‌!

247
ipl 2020
- Advertisement -

ఐపీఎల్ 13వ సీజన్‌పై బీసీసీఐ హింట్ ఇచ్చేసింది. 13వ సీజన్ యూఏఈలో నిర్వహించడం ఖాయమనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ప్రాంఛైజీలు సన్నద్దతను ప్రారంభించాయి. త్వరగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అబుదాబిలో ఏ హోటల్‌లో ఉండాలనే విషయాన్ని తాము నిర్ణయించుకున్నాం అని బీసీసీఐ అధికారి తెలిపారు.

యూఏఈలో ఐపీఎల్‌ జరిగితే జట్ల యాజమాన్యాలు ప్రత్యేక విమానాల్లోనే ఆటగాళ్లు, సిబ్బందిని అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రాధాన్యమిస్తాయని ఫ్రాంచైజీ అధికారి వెల్లడించారు. ఆటగాళ్లందరినీ ఒకచోట చేర్చి.. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఉంచాలని యోచిస్తున్నట్టు మరో ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ తుది నిర్ణయం ప్రకటించగానే.. సెప్టెంబర్‌ – నవంబర్‌ మధ్య 5-6 వారాల్లో ముగిసేలా ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రణాళికను వెల్లడించేందుకు బోర్డు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్ని జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -