- Advertisement -
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు మంగళవారం గచ్చిబౌలిలోనిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఏప్రిల్ 10న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.మిథిల ప్రాంగంణంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.

- Advertisement -