‘గని’ కోసం బన్నీ వస్తున్నాడు..

127
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ సినిమా నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు చిత్ర బృందం.

ఏప్రిల్ 2వ తేదీన వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జగపతిబాబు,సునీల్ శెట్టి,ఉపేంద్ర,నదియా,నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తమన్నా స్పెషల్ సాంగ్ హైలైట్ గా నిలవనుంది. చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

- Advertisement -