కన్నప్ప.. టిక్కి పరిచయం

3
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం వస్తున్న అప్డేట్లు సినిమా మీద అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. కన్నప్ప మూవీ నుంచి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక గత సోమవారం అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించి ప్రీ లుక్‌ను విడుదల చేశారు.

ఇక ఈ సోమవారం కన్నప్ప నుంచి విష్ణు మంచు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు…. టిక్కిని పరిచయం చేశారు. ఈ గుర్రంకు సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్‌లో విష్ణు మంచు లుక్ అదిరిపోయేలా ఉంది. ఇక మున్ముందు కన్నప్ప నుంచి ఎలాంటి అప్డేట్లు వస్తాయో.. ఎంతలా బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Also Read:బాలాపూర్ లడ్డూ @ 30 లక్షల వెయ్యి రూపాయలు

- Advertisement -