‘దేవర’ సెకండ్ హాఫ్ అదరహో!

60
- Advertisement -

‘దేవర’ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇప్పటికే, దేవర ఫస్ట్ హాఫ్ బాగా వచ్చింది అనే వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే.. దర్శకుడు కొరటాల శివ సెకండ్ హాఫ్ పై ఇచ్చిన అప్ డేట్ తో వారు మరింతగా సంబరాలు మొదలు పెట్టారు. సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా వచ్చింది అని కొరటాల క్లారిటీ ఇచ్చాడు. అటు సాంగ్స్ షూట్ తో, ఇటు యాక్షన్ సీన్స్ షూటింగ్ తో కొరటాల శివ బిజీ బిజీగా గడుపుతున్నారు. పెట్టుకున్న టార్గెట్ కల్లా దేవర సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఎన్టీఆర్ – కొరటాల శివ కసిగా కనిపిస్తున్నారంటున్నారు మిగిలిన మేకర్స్. డిసెంబర్ 25 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దేవర షూటింగ్ జరిపి తదుపరి ఫైనల్ షెడ్యూల్ ను జనవరి మూడో వారం ప్లాన్ చేస్తారట.

ఈ షెడ్యూల్ తర్వాత, పాటల చిత్రీకరణ కోసం దేవర టీమ్ ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సాంగ్స్ చిత్రీకరణ కోసం దేవర మేకర్స్ విదేశీ లొకేషన్స్ నే ఎంచుకుంటున్నారట. ఇక వచ్చే సెకండ్ సింగిల్ లో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ కలిసి ఉన్న డ్యూయెట్ ని వదలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా, మరో భామ కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్ మరో ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు.

పైగా ఈ చిత్రం కోసం సైఫ్ అలీఖాన్ కొత్తగా మేకోవర్ అయ్యారు. అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో నిజమైన దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఇక దేవర రెండో పార్ట్ ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచే షూటింగ్ చేస్తారట. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ కూడా ఓ కీల‌క పాత్ర చేస్తుంద‌ట.

Also Read:బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం

- Advertisement -