తారకరత్నపై ద్వేషాన్ని చూపించారా?

40
- Advertisement -

నందమూరి తారకరత్న మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తారకరత్న మరణించి మార్చి 18వ తేదీకి నెల రోజులు గడిచింది. ఈ క్రమంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్ట్ లో చాలా విషయాలు వెలుగు చూశాయి. అలేఖ్యను తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తారకరత్న చాలా కష్టాలు పడ్డాడు అని ఆమె పోస్ట్ ను చూస్తే అర్ధం అవుతుంది.

ఇంతకీ, అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్ట్ లో ఏమి ఉందో.. ఆమె మాటల్లోనే విందాం. ‘మన పరిచయం ప్రేమగా మారింది. నా మనసులో ఎక్కడో ఒక సందిగ్దత ఉండేది. దాంతో, నేను మౌనంగానే ఉండిపోయాను. కానీ, నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళావు. కానీ, మన పెళ్లి నిర్ణయం నిన్ను నీ వాళ్ల అందరికీ దూరం చేసింది. నిన్ను మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందుల పాలు చేసింది ఆ నిర్ణయం.

మన పై కొందరి ద్వేషాన్ని చూడలేక, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకున్నావు. అయినవాళ్లే పదే పదే మనల్ని బాధపెట్టారు. కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. పిల్లలు పుట్టాక మన జీవితం మారిపోయింది. సంతోషం నిండింది. నువ్వు ఎప్పటికీ రియల్ హీరోవే. మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను’ అని అలేఖ్య రెడ్డి పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆమె మాటలను బట్టి.. నందమూరి ఫ్యామిలీ తారకరత్న ను దూరం పెట్టింది అని అర్ధం అవుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -