28న ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ ఆడియో

221
online news portal

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను సోమవారం హైదరాబాద్‌లోని రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

అక్టోబర్‌ 28 ఆడియో, నవంబర్‌ 11 సినిమా విడుదల

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రం రూపొందుతోంది. అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో ఇలాంటి ఓ హార్రర్‌ కామెడీ మూవీ చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. డెఫినెట్‌గా అందరికీ నచ్చే సినిమా ఇది. ఈరోజు రేడియో మిర్చిలో ‘శతమానం భవతి..’ అంటూ భాస్కరభట్ల రాసిన పాటను విడుదల చేశాం. ఈ చిత్రానికి సాయికార్తీక్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అక్టోబర్‌ 28న ఆడియో రిలీజ్‌ చేసి, నవంబర్‌ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

online news portal

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో నా ఫేవరేట్‌ సాంగ్‌ ‘శతమానం భవతి..’ ఈరోజు విడుదల చేయడం ఆనందం కలిగించింది. పాటలన్నీ చాలా బాగున్నాయి. సాయికార్తీక్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నాగేశ్వరరెడ్డిగారితో సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాలు చేశాను. మా కాంబినేషన్‌లో ఇది డెఫినెట్‌గా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సబ్జెక్ట్‌ ఇది. చాలా ఫన్నీగా వుంటుంది. నేను చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించాను. ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాని చూస్తారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు చాలా మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

online news portal

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ – ”ఈ సినిమాలోని అన్ని పాటలు బాగా చేశారు సాయికార్తీక్‌. అలాగే రీరికార్డింగ్‌ కూడా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. ఈరోజు విడుదలైన శతమానం భవతి సాంగ్‌ యూత్‌ అంతా హమ్‌ చేసుకునేలా వుంటుంది. ఇంత మంచి ఆడియో ఇచ్చిన సాయికార్తీక్‌కి థాంక్స్‌. ఈ సినిమాలో నరేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ పీక్స్‌లో వుంటుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా వుంటుంది” అన్నారు.

online news portal

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.