తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడూ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ శక్తివంతమైన పార్టీగా టీడీపీ ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. 2014 లో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణలో 15 సీట్లు కైవసం చేసుకోని పార్టీ ఉనికిని చాటుకుంది. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి కేవలం 2 సీట్లకే పరిమితం అయి టీడీపీ శ్రేణులను ఆశ్చర్య పరిచింది. అయితే టీడీపీ తెలంగాణలో ఇంత దారుణంగా పడిపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి.
చంద్రబాబు తెలంగాణ కంటే ఏపీ పైనే ఎక్కువ ఫోకస్ చేయడం, టీడీపీని ఆంధ్రప్రదేశ్ పార్టీగా తెలంగాణ ప్రజలు భావిచడం.. ఇలా ఎన్నో కారణాల చేత టీడీపీ ప్రభంజనం తెలంగాణలో దారుణంగా పడిపోయింది. ఇదే టైమ్ లో చంద్రబాబు పై ఓటుకు నోటు వ్యవహారం కూడా కొంత మేర టీడీపీ పై ప్రభావం చూపిండనే చెప్పాలి. ఇక గతాన్ని వదిలేస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికలతో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో బహిరంగసభలు, పర్యటనలు చేస్తూ తెలంగాణలో టీడీపీ రేస్ లో ఉందనే సంగతి గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పక్కా ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఇంటింటికి తెలుగుదేశం అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనేది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మరి ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న వేళ మసకబారిన టీడీపీని టిఎస్ ప్రజలు ఎంతవరుకు గుర్తిస్తారో చూడాలి. మొత్తానికి చంద్రబాబు అటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం ఇటు తెలంగాణలో ఉనికి కోసం ఏడు పదుల వయసులో కూడా గట్టిగానే కష్టపడుతున్నారని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి…