‘గుడ్ లక్ సఖి’ నుండి ‘ఇంతందంగా’ సాంగ్‌.. వీడియో

102
Good Luck Sakhi
- Advertisement -

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈరోజు ‘ఇంతందంగా’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.

‘ఓ రంగురంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే చెంగు చెంగు మంటాందే మనసు.. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు..’ అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా.. స్వయంగా పాడారు. గేయ రచయిత శ్రీమణి ఈ గీతానికి సాహిత్యం అందించగా.. కమల్ ఎస్లవత్ బంజారా లిరిక్స్ రాశారు. ఈ సాంగ్‌కు విజయ్ బిన్నీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కీర్తి సురేష్ వేసిన సింపుల్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

https://youtu.be/Y6V7toar_EU
- Advertisement -