మహిళా దినోత్సవం..సంబరాలకు టీఆర్ఎస్ పిలుపు

150
ktr
- Advertisement -

అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు సంబరాలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉద‌యం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మ‌హిళా బంధు కేసీఆర్ పేరిట సంబ‌రాలు నిర్వ‌హించాల‌న్నారు.

ఈ నెల 6వ తేదీన పార్టీ మ‌హిళా నాయ‌కులు కేసీఆర్‌కు రాఖీలు క‌ట్టాల‌ని కేటీఆర్ సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్ల‌తో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం నిర్వ‌హించాల‌న్నారు.

7న క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్‌, కేసీఆర్ కిట్‌తో పాటు ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల నివాసాల‌కు వెళ్లి వారిని కలిసి సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు. 8న నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో మ‌హిళ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

- Advertisement -