- Advertisement -
ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కరోనా వ్యాప్తి, అన్ లాక్ 2 లో భాగంగా నేటి వరకు అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం విధించింది.
మరోసారి ఆగస్టు 31 వరకు కొనసాగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.కేవలం హోంశాఖ అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రమే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ తెలిపింది. అటు కార్గో విమానాలు, వందేమాతరం మిషన్‌లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.
- Advertisement -