- Advertisement -
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడగించింది కేంద్రం. జూన్ 30 వరకు అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది.
అయితే ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా పలు దేశాలతో భారత్ చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు విమానాల రాకపోకలు ఉంటాయని తెలిపింది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
- Advertisement -