అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలి.. అడవి బిడ్డలకు సౌకర్యాలన్నీ అందేలా అడవి తల్లి బాట అడుగులు వేస్తోంది అన్నారు.
డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది.. ప్రకృతి ఒడిలో జీవిస్తూ.. నిరంతరం పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు అన్నారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.
Also Read:విరాట్ కోహ్లీ..నయా లుక్
1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది.

