- Advertisement -
ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.. కోవిడ్ విజృంభణతో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగరబోతున్నాయి.
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అయ్యిందని అధికారుల తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గిపోవడం.. వ్యాక్సినేషన్ క్రమంగా పెరగడంతో… అంతర్జాతీయ విమానాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు తెలిపారు. 27 నుండి అంతర్జాతీయ విమానాలను యథాతథంగా షెడ్యూల్ చేస్తామని తెలిపారు.స
కరోనా మహమ్మారి ప్రభావం తో అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.
- Advertisement -