- Advertisement -
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11న 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ అవ్వాలని ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.
ఏపీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఏ4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయనపై IPC సెక్షన్లు 409, 420, 384, 201, 120 (B) తో పాటు సెక్షన్లు 34 & 37 కింద Cr. నెం. 21/2024, అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్లు 7, 7A, 8, 12, 13 (1) (B), 13 (2) కింద కేసులు నమోదయ్యాయి.
Also Read:జాతస్య మరణం ధ్రువం..యూనిక్ థ్రిల్లర్
- Advertisement -

