ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేనేత రంగంపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉందని, ముడిసరుకుల ధరలు పెరిగి చేనేతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల న్యాయం జరుగుతుందని చేనేతలు కోరుకుంటున్నారని, నేతన్నకు నెలకు నికర ఆదాయం రూ. 8వేలు నుంచి రూ.10వేలు వచ్చేలా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నెలలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధన పెట్టేలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. మీరు ఇప్పుడు ధరించిన చీర చేనేతదేనా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో చేనేతదేనంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు.దీంతో సభ సభలో నవ్వులు విరబూశాయి.
Also Read:‘దేవకి నందన వాసుదేవ’..నా అదృష్టం: మానస వారణాసి