టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఘాజీ. 1971లో జరిగిన భారత్ , పాకిస్థాన్ యుద్ధ సమయంలో సముద్ర గర్భంలో అదృశ్యమయిన సబ్ మెరైన్ ‘ఘాజీ’ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా నావెల్ ఆఫీసర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఘాజీ ఈ నెల 17న తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా బాలీవుడ్‌లో కరణ్ జోహార్ ఘాజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రాంభించిన చిత్రయూనిట్ సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రానా బజాజ్ బైక్‌ని కొని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
దీంతో గతంలో నేవీ అధికారులు ఉపయోగించే కోడ్ భాషలతో ఓ పోస్టర్ రిలీజ్ చేసిన ఘాజీ యూనిట్ అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా ఘాజీ ప్రమోషన్స్ లోకి తెచ్చేశారు. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా ఘాజీ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించడంలో కీలక భాగమైన షిప్ క్రూ మెంబర్లతో కలిసి.. ఇందిరా గాంధీ ఓ ఫోటో దిగారు. ఇప్పుడు ఆ ఫోటోను ప్రింట్ చేస్తూ.. మరో మూడు రోజుల్లో ఘాజీ అంటూ ప్రచారం చేస్తోంది ఘాజీ యూనిట్. దీంతో ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఘాజీ మూవీ ఎట్రాక్ట్ చేస్తోంది.