జియోలో మరో భారీ పెట్టుబడి..!

236
jio intel
- Advertisement -

రిలయన్స్ జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్ వంటి సంస్థలు పెట్టుబడి పెట్టగా తాజాగా మరో విదేశీ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.

తాజాగా అమెరికాకు చెందిన ఇంటెల్‌ రూ.1894.50 కోట్లు పెట్టుబడుటు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో జియోలో ఇంటెల్‌ సంస్థ 0.39 శాతం వాటా దక్కించుకోనుందని ఆర్‌ఐఎల్‌ ప్రకటిచింది.

గత 11 వారాల్లో పెట్టుబడులు పెట్టిన 12వ సంస్థగా ఇంటెల్‌ నిలిచింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలైన ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, విస్తా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబదలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టీపీజీ, ఎల్‌ కాటర్టన్‌, పీఐఎఫ్‌ సంస్థలు పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -