కరోనా వైరస్‌…ముందస్తు జాగ్రత్తలు

1070
corona virus
- Advertisement -

హైదరాబాద్‌లో కరోనా వైరస్ (కొవిడ్-19) గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దీంతో పాటు ప్రజలు కరోనా భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల కోసం పలు సూచనలను చేసింది ప్రభుత్వం.

() జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

()చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి

()దగ్గిన, తుమ్మిన సమయంలో చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డు పెట్టుకోవడంతో పాటు మాస్క్‌ కట్టుకోవాలి

()గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు చలి ప్రదేశాల్లో తిరగకూడదు

()ఇతరులు, అపరిచితులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి

()దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది

() పెంపుడు జంతువులు ఉంటే వాటికి దూరంగా ఉండాలి

- Advertisement -