తెలంగాణ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది సుప్రీం కోర్టు. ఎన్‌కౌంటర్‌పై ఇవాళ వాదనలు విన్న న్యాయస్ధానం విశ్రాంత న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్‌తో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో జస్టిస్ రేఖా ప్రకాశ్ బల్దోతా, కార్తికేయన్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు.
తొలి విచారణ తేదీ నుంచి ఆరు వారాల్లోగా నివేదకి అందించాలని ఆదేశించింది సుప్రీం. అంతేగాదు హైదరాబాద్‌లోనే ఉండి కమిటీ దర్యాప్తు చేయాల్సిందిగా సూచించింది. కేసుకు సంబంధించి మీడియా, సామాజిక మాధ్యమాలను కట్టడి చేయాల్సిందిగా ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. నిందితుల్లో ఇద్దరు పోలీసుల పిస్తోళ్లను తీసుకుని కాల్పులు జరిపామని…సిట్ ఏర్పాటు చేసి ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
SC Sets up Inquiry commission for Hyderabad encounter..Supreme court orders three member judicial inquiry into telangana encounter