టీ20 సిరీస్…క్లీన్ స్వీప్ చేసేనా?

99
ind
- Advertisement -

వెస్టిండీస్‌తో ఇవాళ కోల్ కతా వేదికగా మూడో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుంది భారత్. నామమాత్రమైన మ్యాచ్ కావడంతో కొత్త ఆటగాళ్లకి ఛాన్స్ ఇవ్వనున్నారు.

విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ స్థానంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రాబోతున్నారు. కీపింగ్ బాధ్యతలు ఇషాన్ చేతికే రాబోతున్నాయి. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్‌ లేదా హర్షల్ పటేల్‌లో ఒకరికి రెస్ట్ ఇచ్చి.. మహ్మద్ సిరాజ్ లేదా అవేష్ ఖాన్‌లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

శ్రీలంకతో మార్చిలో టెస్టు సిరీస్ ఉండటంతో భారత సెలెక్టర్లు.. కోహ్లీ, పంత్‌కి 10 రోజుల రెస్ట్‌ ఇచ్చారు.

- Advertisement -