సమాచార శాఖ కమిషనర్స్‌… ప్రమాణస్వీకారం

434
katta shekar reddy
- Advertisement -

హైదరాబాద్అ బిడ్స్ ఏంజె మార్కెట్ లోని సమాచార శాఖ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్స్ గా కట్టా శేఖర్ రెడ్డి,గుగులోతు శంకర్ నాయక్,మైడా నారాయణ రెడ్డి,డాక్టర్ మహ్మద్ అమీర్,సయ్యద్ ఖలీలుల్లా ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరిచేత రాష్ట్ర సమాచార చీఫ్‌ కమిషనర్‌ రాజాసదారాం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సమాచార కమిషనర్ బుద్ద మురళి ,ప్రిన్సిపాల్ సెక్రటరీ వికాస్ రాజు పాల్గొన్నారు. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం శేఖర్‌రెడ్డి స్వస్థలం కాగా.. 1987నుంచి వివిధ పత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఎంఏ, ఎంఫిల్‌ చదివిన కట్టా.. 2010నుంచి నమస్తే తెలంగాణ వ్యవస్థాపక సీఈఓగా, 2014నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముభారస్‌పూర్‌ గ్రామానికి చెందిన మైడ నారాయణ రెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. 1995లో వార్త పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 2003లో ఆంధ్రజ్యోతిలో చేరారు. 2007-08లో సాక్షి మీడియాలో ఛీప్‌ రిపోర్టర్‌గా పని చేశారు. 2008లో హెచ్‌ఎంటీవీ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. 2009 నుంచి టీ న్యూస్‌ ఎడిటర్‌, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రెస్‌ అకాడమీ కమిటీ మెంటార్‌గా వ్యవహరించారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉన్న శంకర్ నాయక్.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామ పరిధిలోని భావోజీ తండాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం స్టేట్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ, ఓయూ జేఏసీ జనరల్‌ సెక్రటరీగా, గిరిజన కెరటం ఫౌండర్‌ ఎడిటర్‌గా, సేవాలాల్‌ మహారాజ్‌ యువసేన ప్రెసిడెంట్‌గానూ పని చేశారు.

హైదరాబాద్‌‌లోని శాంతినగర్‌కు చెందిన డాక్టర్‌ ఎండీ అమీర్‌ 1969లో జన్మించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన అమీర్ అనేక న్యాయ అవగాహన కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్‌ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పిల్లల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, విడాకులు పొందిన పేద మహిళల తరపున ఎంజీవోలతో కలిసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

సయ్యద్‌ ఖలీలుల్లా 1961లో హైదరాబాద్‌ నగరంలో జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి 1990లో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. సిటీ క్రిమినల్‌ కోర్టులో లాయర్‌గా పనిచేశారు. ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్‌ అసోసియేషన్‌ లీగల్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు.

katta shekar reddy katta shekar reddy katta shekar reddy

- Advertisement -