సంతాన సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే సమస్యల కారణంగా సంతాన సమస్యతో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పోషకాలతో నిండిన ఆహార పదార్థాలను జీవన శైలీలో భాగం చేస్తే ఖచ్చితంగా సంతాన లేమి సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
ప్రెగ్నెన్సీ రావాలంటే అండం విడుదల ఎంత ముఖ్యమూ…దాని నాణ్యత కూడా అంతే ముఖ్యం. మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అండాశయాల్లో ఉత్పత్తయ్యే అండాల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోమని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ముఖ్యంగా విటమిన్లు సి, ఇ, ఫొలేట్, బీటా కెరోటిన్, ల్యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కాయకూరలు, నట్స్, ధాన్యాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలి.మగవారిలో వీర్యకణాల నాణ్యత పెరగాలన్నా వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం.
అలాగే జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. బేకరీఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. పాలు, పాల ఉత్పత్తులు, ప్రొటీన్లు, మాంసాహారం, చేపలు తీసుకోవడం మంచిది. పీసీఓఎస్ సమస్యను తగ్గించుకునేందుకు తక్కువ కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. మొత్తంగా ఈ ఆహారపు అలవాట్లు పాటిస్తే సంతానలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
Also Read:కేబినెట్ విస్తరణ..వీరికే ఛాన్సా!