‘ఇందువదన’ సెన్సార్ పూర్తి.. జనవరి 1న రిలీజ్‌..

45
Induvadana

వరుణ్‌ సందేశ్, ఫర్నాజ్‌ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ఇందువదన’. ఎం. శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు సతీష్‌ ఆకేటీ అందించగా, శివ కాకాని సంగీతం అందించారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్స్‌: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ.