గాంధీలో సీటీ స్కాన్ సేవ‌లు ప్రారంభించిన మంత్రి హరీష్..

45

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌ రావు శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ధాన ఆస్పత్రుల్లో 21 సీటీ స్కాన్ కేంద్రాల‌ను మంజూరు చేశామ‌న్నారు. అందులో మొద‌టి సీటీ స్కాన్ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించామ‌ని తెలిపారు.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో సీటీ స్కాన్ అవ‌స‌రం ఉంది. గాంధీ ఆస్ప‌త్రిలో ముఖ్య‌మంగా గుండె జ‌బ్బుకు సంబంధించిన క్యాథ‌లాబ్ కూడా అవ‌స‌రం ఉంది. కొత్త క్యాథ‌లాబ్‌ను రూ. 6.5 కోట్ల‌తో, ఎంఆర్ఐ మిష‌న్‌ను రూ. 12.5 కోట్ల‌తో మంజూరు చేశాం. గాంధీలో ఎంఆర్ఐ, క్యాథ‌లాబ్‌ను వ‌చ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.