పూజా హెగ్డే చాలా ఓపెన్ గా ఉంటుంది. తన కెరీర్‌లో తాను ఫేస్ చేసిన విషయాలను ఓపెన్‌గా మాట్లాడటానికి ఎప్పుడూ వెనకాడడు పూజా హెగ్డే. విషయం ఏదైనా సరే, సింపుల్ గా అవసరమైతే వెరీ బోల్డ్ గా చెప్పేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో చేసే జర్నీ గురించి కూడా ఈ మధ్య అలాంటి ఒపీనియన్‌నే పూజా హెగ్డే షేర్ చేసింది. ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాలి అట. అందం అభినయం ఉన్నా. ఇండస్ట్రీలో నెట్టుకురావడానికే, ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ఎన్నో త్యాగాలు చేయాలట.
హాయిగా సాగుతున్న నీ లైఫ్‌లో సినిమాలు ఎందుకు? అని పూజా హెగ్డే పేరెంట్స్ అన్నారట. ఇండస్ట్రీలో నెగ్గి చూపిస్తానని, తన మీద తనకు చాలా నమ్మకం ఉందని వాళ్లను ఒప్పించే సరికి తల ప్రాణం తోకకి వచ్చిందని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. పేరెంట్స్ ని ఒప్పించడం ఒక ఎత్తయితే, ఇండస్ట్రీలోకి వచ్చాక నిలదొక్కుకోవడం ఇంకో ఎత్తు అన్నది పూజా హెగ్డే చెబుతున్న మాట. నిజమే.. ఇండస్ట్రీ పరిస్థితులు పరిచయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే అవసరాలతో కూడున్నవి అయ్యి ఉంటాయి.
వీటన్నింటి మధ్య ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయం కాదు అని పూజా హెగ్డే అంటుంది. పూజా హెగ్డే ఇంకా మాట్లాడుతూ.. ‘నటించగలమనే కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోదు. ప్రతిరోజూ ఇక్కడ ఎన్నో చేయాలి, మన లోకంతో మనమే పోరాటం చేయాలి. అలాగే ఫ్యాషన్ తోనూ పోరాటం చేయాలి. అలాగే సోషల్ మీడియాతోనూ పోరాటం చేయాలి అంటూ మొత్తానికి పూజా హెగ్డే చాలా విషయాలే చెప్పింది. నేషనల్ క్రష్మిక రష్మిక మందన్నా కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచింది. పాపాం హీరోయిన్ల కష్టాలు వర్ణనాతీతం అన్నమాట.
ఇవి కూడా చదవండి…