‘ఇంద్రాణి’..మాస్ మార్వెల్ మూవీ

8
- Advertisement -

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ విమన్ మూవీ ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

‘ఇండియన్ సూపర్ ఫోర్స్’ గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇంద్రాణి’ ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..’ఇంద్రాణి’ ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా వుంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. యానీయా ఇండియన్ సూపర్ విమన్ గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఇంద్రాణి మాస్ మర్వెల్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంప్లీట్ ఎంటర్ టైనర్’ అన్నారు

కబీర్ సింగ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ స్టీఫెన్ కి హ్యాట్సప్ చెప్పాలి. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. ఇండియాలో చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమా. ఇందులో సూపర్ విలన్ గా చేశాను. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసే సినిమా ఇది. చాలా యూనిక్ ఫిల్మ్ లో ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

Also Read:అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని అదృశ్యం

- Advertisement -