FCRI సిబ్బందికి అభినంద‌న‌లు: మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

222
indrakaran reddy
- Advertisement -

అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు రావ‌డం గొప్ప విష‌య‌మ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

FCRIకి ఇండియన్ ఫారెస్ట్ కౌన్సిల్ ఏ ప్ల‌స్ క్యాట‌గిరీ రావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ప్రోత్స‌హం, సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌లతోనే ఇది సాధ్య‌మైంద‌న్నారు. రానున్న రోజుల్లో ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను, అట‌వీ వృత్తి నిపుణుల‌ను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు వీలుగా దేశం గర్వించే రీతిలో ఈ క‌ళాశాల‌ విద్యార్థుల‌ను తీర్చిదిద్దేలా మ‌రింత కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.

ఇంత‌టి గుర్తింపు రావడానికి కృషి చేసిన FCRI డీన్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.

- Advertisement -