గడప గడపకు టీఆర్ఎస్ ప్రచార రథం..

379
trs
- Advertisement -

టీఆర్‌ఎస్ ప్రచార రథం ద్వారా గడప గడపకు ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించి ముందుకెళ్తున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అర్హులందరికీ పింఛన్లతో అందరి మన్ననలు
పొందామని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ని ఎదుర్కొనే ధైర్యం లేకనే మహాకూటమి ఏర్పాటుతో ప్రతిపక్షాలు ముందుకువస్తున్నాయని చెప్పారు మంత్రి పోచారం. బిక్కనూరులో టీఆర్ఎస్ విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బీమా పథకంతో రైతన్నలకు భరోసా కల్పించామని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.

pocharamకుల,మత,ప్రాంతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు మంత్రి ల‌క్ష్మారెడ్డి. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా ఈ ప్రాంత ప్ర‌జ‌ల కాళ్ళు క‌డుగుతామ‌ని చెప్పారు. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్త‌యితే ఈ ప్రాంతాంలోని ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు అందించి స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌న్నారు.

- Advertisement -