నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆదివాసీ ముద్దు బిడ్డ కొమురం భీం విగ్రహాన్ని మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు ఆదివాసీలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొమురం భీం ఆశయ సాధనల కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం కొమురం భీం ‘జల్’ ‘జంగల్’ ‘జమీన్’ నినాదంతో పోరాడడని ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 కోట్లతో జోడేఘాట్‌లో ఆయన విగ్రహాన్ని మ్యూజియంను ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచారని ప్రతీ ఏటా ప్రభుత్వం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ట్యాంక్ బండ్‌పైన ప్రభుత్వం భీం విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసిందని, త్వరలోనే నిర్మల్ పట్టణంలో భీం కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి నాయకులు ముందుకు వస్తున్నారని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నాయక్ పోడ్ కులస్తులకు సంఘ భవనం కోసం రూ.15 లక్షల నిధులు ఇచ్చామని వెయ్యి ఉరుల మర్రి వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు
అనంతరం అన్నదానన్ని మంత్రి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, సర్పంచ్ రవీందర్ రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, ఎంపిపి రామేశ్వర్ రెడ్డి, కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ మహేష్ రెడ్డి ,నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,గిరిజన నాయకులు మొసలి చిన్నయ్య, సహదేవ్, ప్రవీణ్, ఆర్‌డీఓ రమేష్ రాథోడ్, ఎంఆర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.