కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్‌కు తీర‌ని లోటు- మంత్రి

36

దివంగ‌త‌ డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్‌కు, ద‌ళిత స‌మాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడీసీసీ ఆద్వ‌ర్యంలో సంతాప సభ నిర్వహించారు. కాంబ్లే నాందేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి… మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నేత‌లు నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా కాంబ్లే నాందేవ్‌తో తమకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. ఎజెన్సీ ఏరియాలో ద‌ళితుల‌ సంక్షేమం కోసం కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. కాంబ్లే కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.