- Advertisement -
ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. శనివారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. హరియాణాకు చెందిన 21ఏళ్ల వైద్య విద్యార్థిని చిల్లార్ గ్రాండ్ ఫైనల్‌లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది.
మొదటి రన్నరప్‌గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన స్టీఫెనీ హిల్ నిలిచింది. 2000లో బాలీవుడ్ నటి ప్రియాంకాచోప్రా మిస్‌వరల్డ్‌గా నిలిచింది. దాదాపు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్‌కు చెందిన చిల్లార్ దక్కించుకుంది.
- Advertisement -