మొహాలీలో భారత్‌ మోత..

219
India's all-round show earns 2-0 lead
- Advertisement -

మొహాలీ వేదికగా ఇంగ్లాండ్‌తో మధ్య జరిగిన మూడో టెస్ట్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ నుంచే మ్యాచ్ పై పట్టు సాధించిన టీం ఇండియా..అదే జోరు ను కొనసాగిస్తూ..టెస్ట్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 103 పరుగుల లక్ష్య ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి…విజయాన్ని అందుకుంది. టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ 67 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 78/4తో నాలుగో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన ఇంగ్లాండ్‌ను టీమిండియా బౌలర్లు 236 పరుగులకు కుప్పకుల్చారు. జోరూట్‌ (78), హసీబ్‌ హమీద్‌ (59 నాటౌట్‌) అర్ధశతకాలు చేయడంతో భారత్‌కు ఆ జట్టు 103 పరుగుల లక్ష్యం విధించింది. అశ్విన్‌ 3, షమి, జడేజా, జయంత్‌ యాదవ్‌ తలో 2 వికెట్లు తీశారు. 103 లక్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ మురళీ విజయ్ (1) పరుగుతో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఛటేశ్వర్ పుజారా మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ తో కలిసి మరో వికెట్ పడకుండా..స్కోరు బోర్డ్‌ను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా పార్థివ్ పటేల్‌ వన్డే తరహా బ్యాటింగ్ తో దూకుడుగా ఆడాడు. . పార్దివ్ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. 53 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బౌండరీతో జట్టుకు విజయం అందించాడు. పుజారా 25 పరుగులు చేశాడు. కోహ్లీ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

India's all-round show earns 2-0 lead

తొలుత 78/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. టీ విరామ సమయానికి ముందే 236 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 102 పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించింది. జో రూట్ (78), హసీబ్ హమీద్ (59) పోరాడినా ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. క్రిస్ వోక్స్ 30 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగి హాఫ్ సెంచరీలతో రాణించి స్పిన్నర్లు జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో బాల్‌తో ప్రతాపం చూపి భారత్ విజయానికి బాట వేశారు. వీరికి ఫాస్ట్ బౌలర్ షమీ జత కలిశాడు. అశ్విన్ 3, జడేజా, జయంత్, షమీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఆల్ రౌండ్ ప్రతిభతో బ్యాటింగ్,బౌలింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.5 ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.డిసెంబర్ 8 నుంచి నాలుగో టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

India's all-round show earns 2-0 lead

8 ఏళ్ల తరువాత పునఃప్రవేశించిన తనకు సహచరులు మంచి సపోర్ట్ ఇచ్చారని టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ అడుగుపెట్టేందుకు 8 ఏళ్లు సుదీర్ఘ విరామం తీసుకోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ పునఃప్రవేశంలో రాణించడం ఆనందంగా ఉందని తెలిపాడు. జట్టు నుంచి ఉద్వాసనకు గురైన తరువాత బ్యాటింగ్ మీద బాగా కసరత్తు చేశానని తెలిపాడు. అందుకే డ్రైవ్ లు ఆడగలుగుతున్నానని చెప్పాడు. కట్ షాట్లపై కొద్దిగా సాధికారత సాధించానని పేర్కొన్నాడు. బేసిక్స్ కు కట్టుబడి బ్యాటింగ్ చేశానని, అందుకే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అర్థసెంచరీ సాధించానని పార్థివ్ తెలిపాడు. ఇలా రాణించడం ఏ ఆటగాడికైనా ఆనందమేనని, విన్నింగ్ షాట్ కొట్టడం మరపురాని అనుభూతి అని పార్థివ్ పటేల్ తెలిపాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (93.5 ఓవర్లు)
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 417 (138.2 ఓవర్లు)
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : 236 (90.2 ఓవర్లు)
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 104/2 (20.2 ఓవర్లు)

- Advertisement -