కేసీఆర్ స్కిమ్స్‌..పెరిగిన ప్రజల ఆయుష్షు

255
Elderly Indians participate in celebrations to mark Internationa
- Advertisement -

సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో తెలంగాణ ప్రజల ఆయుష్షు పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ప్రజల సగటు జీవితకాలం పెరగగా ఐసీఎంఆర్, పీహెచ్‌ఎఫ్‌ఐ, ఐహెచ్‌ఎం సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పథకాలు,మిషన్ భగీరథతో ఆరోగ్య సమస్యలు మెరుగయ్యాయని సర్వే వెల్లడించింది. అంటురోగాల నివారణ, నవజాత శిశువులకు వ్యాక్సినేషన్, అందరికీ ఆహారం అందుబాటులోకి తేవడం, వైద్యరంగంలో సాంకేతిక అభివృద్ధి సాధించడం వంటి కారణాలతో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగిందని సర్వేల్లో వెల్లడైంది. వయసులవారీగా మరణాలను పరిశీలిస్తే 0-14 వయసువారు 7.6 శాతం, 15-39 వయసువారు 11.4 శాతం, 40-69 వయసువారు 43.1 శాతం, 70 ఆపై వయసువారు 37.9 శాతం ఉన్నారు.

1990 నుండి 2017 వరకు ప్రజల జీవితకాలంలో ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. అప్పటితో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం పదేండ్లు పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో జాతీయ సగటు కంటే ఎక్కువగా జీవితకాలం ఉన్నట్టు నిర్ధారించారు. 25 సంవత్సరాల క్రితంతో పోలిస్తే తెలంగాణలో డయేరియా, ఊపిరిత్తుల ఇన్‌ఫెక్షన్లు, నెలలు నిండకముందే కాన్పులు, తట్టు, మెదడువాపు, క్షయ, పుట్టుకతో వచ్చే సమస్యలు తగ్గిపోయాయి.

ప్రజల ఆయుర్ద్దాయం పెంచడంలో భాగంగా మాతా, శిశు సంరక్షణకు కేసీఆర్ కిట్ల పథకం అమలుచేస్తున్నారు. నవజాత శిశువులు పోషకలోపంతో చనిపోకుండా ఉండేందుకు గర్భిణులకు పోషకాహారాన్ని అందించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నది.ఈ నేపథ్యంలో జాతీయ సగటుతో పోలీస్తే తెలంగాణ ప్రజల ఆయుష్షు పెరిగిందని సర్వేలో వెల్లడైంది.

- Advertisement -