GT TV ఇంటర్వూలో కేఏ పాల్ చేసిన కామెడీ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

255
KA Paul
- Advertisement -

ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వేసిన జోకులకు కాస్త చల్లబడిందనే చెప్పుకోవాలి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు కడుపుబ్బా నవ్వకున్నారు. అప్పుడప్పుడు ఆయన డ్యాన్స్ , పాటలు పాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఏపీలో ఈసారి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు కేఏ పాల్. తాజాగా కేఏ పాల్ గ్రేట్ తెలంగాణ టీవి ఇంటర్యూలో పాల్గోన్నారు. ఈ ఇంటర్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Bs :ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీరు చాలా కష్టపడ్డటున్నారు కదా? కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారెమో అనుకున్నాం..కానీ మళ్లీ యుద్దం స్టార్ట్ చేశారు ఏంటీ?
KA Paul: ఇంత దారుణమైన ఎన్నికలు జరిగినాక ఇంక రెస్ట్ ఎలా తీసుకుంటాం.. ఇంత ఘోరమైన ఎన్నికలు ప్రపంచంలో ఎక్కడ జరగవు..అందుకనే మనం అందరం కలిసి పనిచేయాలి. మార్చి 25 తారీఖు ఏ ఫారాలు, భీ ఫారాలు దొంగించాలన్న ప్లాన్ ను చంద్రబాబు గారు ముందే ఏశారు. దానికి ప్రూఫ్ లు కూడా నేను చూపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఒక 38మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దుల్ని ఓడించడానికి వైసిపి అభ్యర్దుల పేర్లతో ఉన్న వారితో మా పార్టీ నుంచి దొంగ తనంగా భీఫారాలు ఇచ్చి నిలబెట్టారు. వైసిపి ఓట్లను చీల్చడానికి చంద్రబాబు ఈ ప్లాన్ ను వేశాడు. మా భీ ఫారాలు దొంగిలించిన తర్వాత మాకు సెక్యూరిటీని ఇచ్చారు.

Bs : మీకు సెక్యూరిటీ కావాలని చాలా సార్లు కోర్టుకు వెళ్లారు? కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎందుకు సెక్యూరిటిని ఇవ్వలేదు?
KA Paul:సుప్రీంకోర్టుకు కూడా నాకు సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 11న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటి ఇవ్వమని ఆర్డర్ చేశారు అయినా ఇవ్వలేదు. మరల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా కూడా మార్చి 11న ఆర్డర్ చేశారు అప్పుడు కూడా ఇవ్వలేదు. అలాగే మార్చి 18న ఏపీ ఎలక్షన్ సీఈవో ద్వివేది కూడా ఆర్డర్ చేశారు. మార్చి 25 తెల్లవారుజామున భీ ఫారాలు దొంగతనం చేసిన తర్వాత నాకు సెక్యూరిటీ ఇచ్చారు. అది కూడా ఒక్క గన్న మెన్ ను ఇచ్చారు.

Bs : మీకు జెడ్ ప్లస్ క్యాటగిరి సెక్యూరిటీ ఎందుకు? అంత ట్త్రెట్ ఉందా మీకు?
KA Paul: నాకు ఇప్పటికి జెడ్ ప్లస్ క్యాటగిరి ని పదిసార్లకు ఎక్కవే ఇచ్చారు. గత 20సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఇండియాకు వచ్చినా నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటిని ఇచ్చేవారు. నేను చెన్నై, ఢిల్లీ, భూపాల్ ఇలా ఎక్కడకు వెళ్లినా 12గన్ మెన్, 50యావరేజ్ పోలీస్ సెక్యూరీటి ఉండేవారు. భోపాల్, రాయచూర్, కైకలూరు లాంటి ప్రాంతాలకు వెళ్లినపుడు 500మందిని నాకు సెక్యూరిటి గా ఇచ్చేవారు. జెడ్ ప్లస్ కాకున్న జెడ్ ఇవ్వాలి లేదా వై ఇవ్వాలి ..పనికిమాలిన ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు నాకు ఎందుకు ఇవ్వడం లేదు. మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి 4+4 సెక్యూరిటిని ఇచ్చారు. నా శిష్యలకు ఇచ్చారు నాకు ఎందుకు ఇవ్వడంలేదు. బాబా రాం దేవ్ నా శిష్యుడు ఆయనకు z+ఇచ్చారు. జగత్ గురు నా దగ్గరకు వచ్చి నా ఆశిస్సులు తీసుకునేవారు, స్వామి శంకరానంద, స్వరూపా నంద ఆయనకు అసలు త్రెట్ ఏ లేదు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారు. తమిళ నాడులో అమ్మ కు z ఇచ్చారు.

Bs : ఒకప్పుడు మీరు చాలా ఫేమస్…పెద్ద పెద్ద ప్రొగ్రాంలలో పాల్గోనేవారు కదా..ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నా అనుకుంటున్నారా?
KA Paul: ఒకప్పుడు నాకు త్రెట్ లేనప్పుడు నాకు సెక్యూరిటీ ఇచ్చారు. ఈ పనికి మాలిన కుటుంబ కుట్రల నుంచి ప్రజలను రక్షించాడానికి ఇప్పుడు వచ్చాను..అప్పుడు శాంతి దూతగా వచ్చాను. నాకు త్రెట్ లేదు అప్పుడు..ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ ఇండియాలో లేదు.. ఇక్కడున్న నాయకుల అంతు చూడడానికి నేను ఇండియా వచ్చాను. ప్రజల వద్ద నుంచి లక్షల కోట్లు దోచుకుంటున్న నాయకుల మీద నా పోరాటం. నా డబ్బులన్ని సీజ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. నా మీద ఇల్లిగల్ కేసులన్ని పెట్టారు.

Bs : ఇప్పుడు మీరు రాజకీయంగా రంగంలోకి దిగారు..మీ నామినేషన్ అప్రూవల్ కాలేదు..మీరు రాజకీయాంగా ఎలా పోరాడుదామనుకుంటున్నారు? మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత మంది గెలుస్తారు?

KA Paul: నర్సాపూర్ లో నామినేషన్ వేసాను.. సయయం లేకపోయినప్పటికి నాకు వేలమంది సపోర్ట్ చేశారు. మే 23న కొన్ని వేల ఓట్లు నాకు పడతాయని ఆరోజు చూస్తారు? మా ఎమ్మెల్యేలు కాదు వాళ్లు..మా భీ ఫారంలు దొంగిలించి మా పార్టీ పేరు మీద వాళ్లు పోటీ చేశారు. మా పార్టీ తరపున అభ్యర్దుల్ని నిలబెట్టడానికి అవకాశం లేకుండా చేశారు ఎలక్షన్ కమిషన్. దానికి రుజువులన్ని గత ఇంటర్యూలోనే చెప్పాను. నా దగ్గర పది రుజువులున్నాయి పది చూపించాను.. అయినా ఆగలేదు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరూ అనేది మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్దులే డిసైడ్ చేశారు. టీడీపీ, వైసిపి పార్టీలకు చెరో 75 సీట్లు వస్తే అప్పుడు మేము గెలిచే 25 సీట్లు కీలకం అవుతాయి. అది రీ ఎలక్షన్ అయితే..రీ ఎలక్షన్ పెట్టమని ఎవరూ అడుగుతారంటే జగన్ ఓడిపోతే అతను అడుగుతాడు…లేదా చంద్రబాబు ఓడిపోతే అతడు అడుగుతాడు.

Bs : సడన్ గా మీ దృష్టి అంతా తెలంగాణ వైపు మళ్లీంచారు ఏంటి.?
KA Paul: లేదు చాలా రోజుల నుంచి నా దృష్టి అంతా తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణను నేను చాలా అభివృద్ది చేశా..తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను హైదరాబాద్ ను అభివృద్ది చేశా. గత ప్రభుత్వాలు ఏవి కూడా తెలంగాణను అభివృద్ది చేయలేదు. హైదరబాద్ కు వందల మంది బిలినియర్లను నేను తీసుకువచ్చాను. గూగుల్ , మైక్రోసాప్ట్ కంపెనీలను హైదరాబాద్ కు నేను తీసుకువచ్చా.. నేను 1980 నుంచి అమెరికాలో ఉన్నా అక్కడ వాళ్ల పరిచయాలతో నేను ఇక్కడకు తీసుకువచ్చాను. సమయం లేక తెలంగాణలో పోటీ చేయలేదు.

Bs : మీరు శ్రీలంకకు వెళ్లారు కదా అక్కడ జరిగిన దాడుల గురించి మీరేంటారు?
KA Paul: శ్రీలంకలో దాడులు జరుగుతాయని ఆదేశ ప్రధానికి నేను ముందే చెప్పాను..కానీ ఆయన పట్టించుకోలేదు..గత 15 సంవత్సరాలుగా నేను అక్కడకి వెళ్లి వస్తుంటాను . ఇప్పుడు పాత ప్రధానికి సపోర్ట్ చేస్తున్నా. మీరు ఆగస్ట్ లో నా ఎఫెక్ట్ చూడండి..అక్కడ మళ్లీ మహేంద్ర రాజపక్ష్ గెలుస్తున్నాడు . ఆయన తమ్ముడే ప్రధాని కాబోతున్నాడు.

Bs :మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యానని చెప్పారు.. త్వరలోనే టెన్త్ ఫలితాలు రాబోతున్నాయి..వాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటీ?
KA Paul: ముందు చనిపోయిన ఆ 23మంది ఇంటర్మీడియట్ విద్యార్దుల కుటుంబాలకు న్యాయం జరగాలి అంటే అక్కడున్న రెస్పాస్సిబులిటి వ్యక్తి ఏవరో ఆయనను సస్పెండ్ చేయాలి. ఆ కుటుంబానికి కనీసం ఒక కోటీ రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అందరూ బాగుండాలని తాము ప్రార్దన చేస్తుంటాం.

KA PAUL FULL INTERVIEW…

- Advertisement -