బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో సినిమా ఎలాంటిదైనా సరే అందులో బెడ్ రూమ్,బాత్ రూమ్ సీన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ,అర్మాన్ మాలిక్ నటించిన చిత్రం బాబూ మోషయ్ బందూక్ బాజ్ సినిమా బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కారణం విపరీతంగా బూతు కంటెంట్ ఉండటమే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ సీన్లను దట్టంగా వడ్డించారట. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమాకి 48 సెన్సార్ కట్స్ పడడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. .
అవి తీసేస్తే ఇక ఈ సినిమా తీసిన దానికి అర్థం వుండదని నిర్మాతలు వాదిస్తున్నారు. సెన్సార్ బోర్డు మరీ పాత తరం మనుషుల్లా వ్యవహరిస్తోందని ఈసినిమాలో హీరోయిన్‌గా నటించిన బిదితా బాగ్ నిప్పులు కక్కింది. మన మగవాళ్లు ముద్దులు పెట్టుకోరా, బూతు మాటలు మాట్లాడరా, సెక్స్ చేయరా అంటూ వ్యంగ్యంగా సెన్సార్ బోర్డుపై సెటైర్లు గుప్పించింది. సినిమాల్లో అవసరార్ధం శృంగార సన్నివేశాలు తొలిగిస్తారంది. గతంలో అలాంటి సన్నివేశాలున్న ఎన్నో సినిమాలు విడుదలయ్యాయని, కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డు విచిత్రంగా ప్రవర్తిస్తోందని మండి పడింది. ఇన్ని కోట్ల ఆదాయాన్ని ఇచ్చే పరిశ్రమని అణచివేయాలని చూడడం తెలివితక్కువతనమని, సినిమా ఇండస్ట్రీ పట్ల ఇన్‌టాలరెంట్‌గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. మరోవైపు సినిమా అనేది కళాత్మకమైన వ్యవహారం. అందులోని కళాత్మక కోణాన్ని పక్కన పెట్టి ఇష్టమొచ్చినట్లు కట్ చేసుకుంటూ పోతే, సినిమా ఎందుకు.? అన్నది ‘బాబూమొషాయ్’ టీమ్ వాదన.
https://youtu.be/8Bakp3UKa3c