రివ్యూ : నక్షత్రం

258
Nakshatram review
- Advertisement -

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈసారి ఎలాగైనా కమర్షియల్ హిట్టు కొట్టాలని యువ హీరోహీరోయిన్లతో తెరకెక్కించిన చిత్రం ‘నక్షత్రం’.సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేస్తోంది. అనేక వాయిదాల  అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో కృష్ణవంశీ మ్యాజిక్ చేశాడా..? నక్షత్రంతో ఈ యువ హీరోల కెరీర్ గాడిలో పడినట్లేనా..?ప్రేక్షకులను ఎంత వరకూ చేరువైందో లేదో చూద్దాం

కథ:

పోలీస్ అవ్వాలని కలలు కనే హీరో సందీప్ కిషన్.. విలన్ తనీష్ కుట్రలో భాగంగా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. న్యాయాన్ని కాపాడటానికే పోలీసే కానవసరం లేదు.. సమాజం పట్ట బాధ్యత ఉంటే చాలని.. ఉద్యోగం లేకపోయినా.. పోలీసు డ్యూటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా డ్యూటీ చేస్తుండగా క్రిమినల్ ముఖ్తార్ కారులో బాంబులు తీసుకెళ్తూ రామారావుకు దొరుకుతాడు. రామారావును నిజం పోలీసు అనుకున్న ముఖ్తార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారుతో సహా బాంబులు పేలిపోతాయి. ముఖ్తార్ ను కాపాడిన రామారావు వాణ్ని తన ఇంట్లో దాచిపెడతాడు. అయితే ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు. అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్ కి అలెగ్జాండర్ కి సంబంధం ఏంటి..? అలెగ్జాండర్ ఏమయ్యాడు.?  సందీప్‌ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మెయిన్ స్టోరీ, లీడ్  యాక్టర్స్ నటన. సందీప్ కిషన్,తనీష్,సాయిధరమ్ తేజ్ ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. ముఖ్యంగా హీరో సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగెటివ్ రోల్ లో యువ నటుడు తనీష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. గెస్ట్ రోల్ లో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్  తనదైన స్టైలో మెప్పించే ప్రయత్నం చేశాడు. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ అలరించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు పాత్రలకు న్యాయం చేశారు.

Nakshatram review
మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్,స్లో నేరేషన్.   తన కెరీర్ కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మరోసారి నిరాశపరిచాడు. క్లారిటీ లేని క్యారెక్టరైజేన్స్, సీన్స్ తో ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు  ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. పాటలు పరవాలేదనిపించినా.. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:

ఎన్నో అవాంతరాలు,వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నక్షత్రం. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ భారీ అంచనాల మధ్య సినిమాను తెరకెక్కించాడు. మెయిన్ స్టోరీ, సందీప్ కిషన్, తనీష్‌తో పాటు లీడ్ యాక్టర్స్ నటన సినిమాకు ప్లస్ కాగా ఫస్ట్ హాఫ్, స్లో నేరేషన్ సినిమాకు మైనస్ పాయింట్స్. తన గత చిత్రాల మాదిరిగా  క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలిపి చూపించే ప్రయత్నం చేసిన కృష్ణవంశీ ప్రేక్షకుడ్ని కథలో ఇన్వాల్వ్ చేయలేకపోయాడు.

విడుదల తేదీ:04/08/2017
రేటింగ్ :  2.5/5
నటీనటులు: సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్
సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర
నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు
దర్శకత్వం : కృష్ణవంశీ

- Advertisement -